News February 18, 2025

అర్గానిక్ పంటలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయండి: కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో అర్గానిక్ పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన అధికారులను ఆదేశించారు. రంపచోడవరంలో పంటల పై అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అర్గానిక్ పంటల ద్వారా మెరుగైన దిగుబడులు సాధించే విధంగా రైతులకు సలహాలు ఇవ్వాలన్నారు. 100శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. పీఒ. సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

నాణ్యమైన ఉత్పత్తులనే అందించాలి: ఐటీడీఏ పీవో

image

భద్రగిరి మార్ట్‌లో నాణ్యత ధ్రువీకరించిన వ్యవసాయ, నిత్యావసర సరుకులనే విక్రయించాలని ఐటీడీఏ పీవో రాహుల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులను గ్రేడింగ్ చేశాకే సేకరించాలని, ప్యాకెట్లపై తయారీ, గడువు తేదీలు ఉండాలని స్పష్టం చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళల సరుకుల తయారీని అధికారులు నెలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు.

News April 17, 2026

VKB: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి: కలెక్టర్

image

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎండల దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 17, 2026

అనకాపల్లి: కేంద్రీయ విద్యాలయానికి 200 మంది ఎంపిక

image

అనకాపల్లి పరిసర ప్రాంతాలలో కేంద్రీయ విద్యాలయం ద్వారా ఎంపికైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు సేకరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ గౌరీ శంకర్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయం ద్వారా 200 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ఎంపిక అయినా విద్యార్థులు వివరాలు కేంద్రీయ విద్యాలయం నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. జూన్24 లోపు దరఖాస్తులు ఇవ్వాలి అన్నారు.