News August 11, 2025
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి: ఇలక్కియా

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కర వేదికకు వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పుడు లాగిన్‌లో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
Similar News
News March 12, 2026
NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.
News March 12, 2026
NGKL: రేపు మెగా జాబ్ మేళా

NGKL జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ పీజీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో రిలయన్స్ ఫౌండేషన్ వారి సహకారంతో డిజిటైర్డ్, గేబ్స్, రైటర్ మొదలైన కంపెనీల సహకారంతో రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.కె.గీతాంజలి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం నిరుద్యోగులు https://forms.gle/NNv9V9tEcPDtTVaW6 లింక్ ద్వారా నేడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News March 12, 2026
భద్రాచలం. ‘శ్రీరామనవమి వేడుకలు.. బస్సులు కొరత ఉండొద్దు’

భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్‌లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం జరిగింది. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం డిపోతో పాటు ఆరు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.


