News March 9, 2025
అర్ధరాత్రి కర్నూలుకు పోసాని

పోసాని కృష్ణమురళిని విజయవాడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే. పోసానిని రెండో రోజు విచారణ చేయనుండగా.. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. రేపు ఆయన బెయిల్ పిటిషన్‌పై కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.
Similar News
News January 17, 2026
మంచిర్యాల: మేయర్, ఛైర్మన్‌ల రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు మేయర్, ఛైర్మన్ రిజర్వేషన్లను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటించారు. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను జనరల్ మహిళకు, లక్షెట్టిపేట ఎస్సీ జనరల్‌కు, చెన్నూర్ బీసీ మహిళకు ఖరారు చేశారు. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైంది.
News January 17, 2026
GWL: సర్పంచులకు శిక్షణ తరగతులు- కలెక్టర్ సంతోష్

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎర్రవల్లి పదవ బెటాలియన్ గంగా హాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడత శిక్షణలో గద్వాల, కేటిదొడ్డి మండలాల్లోని 51 మంది సర్పంచులు శిక్షణకు హాజరు కావాలన్నారు.
News January 17, 2026
సిరిసిల్ల జనరల్ మహిళ.. వేములవాడ బీసీ జనరల్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పీఠానికి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సిరిసిల్ల మున్సిపాలిటీ- జనరల్ మహిళ, వేములవాడ మున్సిపాలిటీ- బీసీ జనరల్ కేటాయించారు. గతంలో ఈ రెండు మున్సిపాలిటీలలో బీసీ మహిళలు ఛైర్‌పర్సన్లుగా కొనసాగగా, తాజా రిజర్వేషన్లతో సమీకరణాలు మారాయి. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా కేటగిరీల అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.


