News September 13, 2025
అలంపూర్‌లో భక్తుల రద్దీ

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో భక్తులు దర్శనాల కోసం వేచి చూశారు. అనంతరం హారతులు అందుకున్నారు.
Similar News
News December 9, 2025
KMR: శీతల గాలులు వీస్తున్నాయి.. జాగ్రత్త

కామారెడ్డి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి మరింత తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. రాత్రి 7 దాటిందంటే శీతల గాలులు వీస్తూ శరీర భాగాలు మంచులా తయారవుతున్నాయి. 75% మంది ప్రజలు పట్టణంలో రాత్రి 9 నుంచి రోడ్లపై కనబడట్లేదు. గ్రామాల్లోనైతే 7గం.ల నుంచే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ప్రజలు ఉదయం, రాత్రి బయటకు రాకపోవడమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
News December 9, 2025
హీరో రాజశేఖర్‌కు గాయాలు

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పాయి.
News December 9, 2025
మద్యం షాపులు బంద్: జనగామ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా శాంతి భద్రతల కోసం మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మూడు ఫేజ్‌ల్లో మండలాల వారీగా మూసివేత అమలు కానుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


