News October 5, 2024
అలంపూర్ నూతన పాలక మండలిపై ఆశలు..?
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల నూతన పాలక మండలితో ఆలయ అభివృద్ధి జరుగుతుందా అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలో ప్రధాన సమస్యలు.. భక్తులు తమ సామన్లు పెట్టుకోవడానికి లాకర్ సౌకర్యం అందుబాటులో లేదు, అన్నదాన సత్రం ఇరుకుగా ఉంది, ఆలయాల ప్రాంగణంలో భక్తులు సేద తీరడానికీ నిలువు నీడ సౌకర్యం లేదు, ఆలయాలకు పార్కింగ్ వేలం పాట ద్వారా రూ. లక్షల ఆదాయం వస్తున్నా.. వాహనాలు ఎండలో ఉండాల్సిన పరిస్థితి.
Similar News
News November 11, 2024
మానవపాడు: కరెంట్ బల్బు కాదు.. సూర్యుని అస్తమయం
విద్యుత్ స్తంభంపై బల్బు వెలుగునిస్తుంది అనుకుంటే పొరపాటు పడినట్టే. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ దృశ్యం మానవపాడు మండల శివారులో రైల్వే బ్రిడ్జి సమీపంలో కనిపించింది. ఓ విద్యుత్ స్తంభంపై సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూపర్లను ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసి విద్యుత్ స్తంభంపై సూర్యుడు ఉన్నాడా.. విద్యుత్ బల్బు వెలుగుతుందా అన్నట్లుగా అనిపించింది. ఈ దృశ్యం వే2న్యూస్ కంటపడింది.
News November 11, 2024
కురుమూర్తి టెంపుల్‌కి ఘాట్ రోడ్డు సంతోషకరం: మంత్రి కోమటిరెడ్డి
కలియుగ దైవంగా కురుమూర్తి దేవస్థానాన్ని భావించి లక్షలాది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2009లో ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు కురుమూర్తి దేవస్థానానికి ఘాట్ రోడ్డు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
News November 10, 2024
పదేళ్లుగా పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారు: రేవంత్
పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పరిశ్రమలు రాలేదు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతున్నాయి. ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రేవంత్ తెలిపారు.