News May 7, 2025

అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర చిరుత సంచారం.? 

image

అలిపిరి సమీపంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం జూ పార్క్ రోడ్డు నుంచి అలిపిరి టోల్ గేట్ మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళుతున్న చిరుతను సెక్యూరిటీ సిబ్బంది చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతలు ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 6వ తేదీన వేదిక్ యూనివర్శిటీలో ఓ చిరుతను బోనులో బంధించి చిట్వేల్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Similar News

News February 12, 2026

జనగామ: ఒకే కుటుంబం.. మూడు తరాల ఓట్లు!

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలోని సుదర్శనం-సరోజన దంపతులకు చెందిన మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదర్శన్ దంపతులతో పాటు కొడుకులు, కోడళ్లు, మనుమరాళ్లు, బిడ్డ, అల్లుడు మొత్తం తొమ్మిది మంది ఓటేశారు.

News February 12, 2026

ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

image

➤ 1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
➤ 1809: అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
➤ 1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
➤ 1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
➤ 1962: సినీ నటుడు జగపతిబాబు జననం(ఫొటోలో)
➤ 1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
➤ 2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం

News February 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.