News January 10, 2026

‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం

image

బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్‌ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్‌లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్‌ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.

Similar News

News January 17, 2026

ఇతిహాసాలు క్విజ్ – 126 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి చివరి శ్వాసలో లక్ష్మణుడు ఆయన దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
సమాధానం: రావణుడి దగ్గర నుంచి లక్ష్మణుడు రాజనీతి నేర్చుకున్నాడు. రావణుడు ‘మంచి పనిని ఆలస్యం చేయక వెంటనే చేయాలి. శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. తన మరణ రహస్యం విభీషణుడికి చెప్పడం వల్లే తాను ప్రాణాలు కోల్పోతున్నానని, కాబట్టి ప్రాణ స్నేహితుడికైనా ముఖ్య రహస్యాలు ను ఎప్పుడూ చెప్పకూడదు’ అని వివరించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 17, 2026

సైలెంట్‌గా దెబ్బకొట్టిన ఇండియా.. అమెరికా పప్పులపై 30% టారిఫ్స్

image

అమెరికా టారిఫ్స్‌కు వాటితోనే సైలెంట్‌గా బదులిచ్చింది ఇండియా. US పప్పుధాన్యాల ఎగుమతులపై 30% సుంకం విధించింది. నవంబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ట్రంప్‌కు సెనేటర్లు రాసిన లేఖతో ఇది బయటపడింది. ఈ టారిఫ్స్ వల్ల US రైతులపై చాలా ప్రభావం పడుతుందంటూ వారు వాపోయారు. ప్రపంచంలో పప్పుధాన్యాల అతిపెద్ద వినియోగదారు భారత్(27%). USపై కేంద్రం సైలెంట్‌గానే ప్రతీకారం తీర్చుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News January 17, 2026

మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన రేవంత్

image

TG: పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.