News May 22, 2024
అల్లర్లు సృష్టించే వారు ఒకసారి ఆలోచించండి: ఎస్పీ

ఏలూరు జిల్లాలో విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకను తిప్పి కొట్టడానికి శాఖ టీంలు రెడీగా ఉన్నాయని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో జరిగిన మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అల్లర్లు సృష్టించాలని రోడ్డు ఎక్కేవారు ఒకసారి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించి రోడ్డుపైకి వెళ్లాలని సూచించారు. ఏది ఏమైనా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 9, 2026
భీమవరం: ఆ 10 ఫిర్యాదులపై తక్షణ చర్యలు

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 10 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. అందిన అర్జీలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
News March 9, 2026
ప.గో: పుట్టినరోజు వేడుకలు జరగాల్సిన చోట.. విషాద ఛాయలు!

తణుకు మండలం వీరభద్రపురానికి చెందిన ఆకుల ఐశ్వర్య (13) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తణుకు ఎస్సీ హాస్టల్‌లో చదువుకుంటున్న ఐశ్వర్యను తన పుట్టినరోజైన ఆదివారం తల్లి శాంతి నిడదవోలు తీసుకెళ్లింది. అక్కడ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు శాంతి, ప్రసాద్ మనస్పర్ధలతో విడివిడిగా ఉంటున్నారు. బాలిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 9, 2026
ఉమ్మడి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీలక్ష్మి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ లెక్చరర్ చేకూరి ఝాన్సీలక్ష్మి నియమితులయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేసినట్లు కార్యదర్శి G.V.S.D ప్రసాద్ తెలిపారు. DNR కాలేజీలో పనిచేసిన ఆమె సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఝాన్సీలక్ష్మికి అభినందనలు తెలుపుతూ సర్వోదయ ఆశయాల పట్ల ఆకాంక్షించారు.


