News March 7, 2025

అల్లవరం: అడ్మిషన్‌కు 13 వరకు గడువు పెంపు

image

గురుకుల అడ్మిషన్ దరఖాస్తులకు ఈ నెల 13 వరకు గడువు పెంచామని అల్లవరం మండలం గోడి గురుకుల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. http:apbragcet.apcfss.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయాలన్నారు.

Similar News

News December 17, 2025

ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

image

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.

News December 17, 2025

నేడే మూడో విడత పోలింగ్

image

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.

News December 17, 2025

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.