News September 13, 2025
అల్లవరం: ‘ప్రేమ వేధింపుల వల్లే బాలిక ఆత్మహత్య’

అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో మైనర్ బాలిక ఆత్మహత్యకు ప్రేమ పేరుతో వేధించిన యువకుడే కారణమని మానవ హక్కుల వేదిక బృందం ఆరోపించింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏడిద రాజేష్ మృతురాలి కుటుంబ సభ్యులను శుక్రవారం కలిసి వివరాలు సేకరించారు. ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Similar News
News December 12, 2025
రోలర్ స్కేటింగ్‌లో విశాఖ క్రీడాకారిణికి గోల్డ్ మెడల్

విశాఖలో 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి శ్రీ సాహితి బంగారు పతకం సాధించింది. ఈ పతకంతో శ్రీ సాహితి ఇప్పటివరకు106 పతకాలు సాధించినట్లు కోచ్ ఆకుల పవన్ కుమార్ వెల్లడించారు. VMRDA శాప్ అందించిన ప్రోత్సాహం విజయానికి దోహదపడ్డాయని శ్రీ సాహితి తెలిపింది.
News December 12, 2025
ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఏర్పాట్లు పూర్తి

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 155 గ్రామపంచాయతీలు, 1392 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
News December 12, 2025
నాకు ఆ విషయం తెలియదు: మంత్రి కోమటిరెడ్డి

సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “టికెట్ల ధర పెంచబోమని అసెంబ్లీలో చెప్పాను.. ఇకపై రేట్లు పెంచే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే తాజాగా జీవో విడుదలైందని, దీనిపై నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే ధరలు తగ్గాల్సిందేనని, సామాన్యుడిపై భారం పడనివ్వబోమని మంత్రి ఉద్ఘాటించారు.


