News April 23, 2025

అల్లూరి: ‘ఆ ఐదు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు’

image

అల్లూరి జిల్లాలో పదోతరగతి ఫలితాలు నిరాశ పరిచాయి. ఆశ్రమ పాఠశాలలు జెర్రిల, ధారకొండ, అప్పర్ సీలేరు, KGBV డుంబ్రిగూడ, ప్రాజెక్టు హై స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని DEO బ్రహ్మాజీ రావు తెలిపారు. రాజవొమ్మంగి ఏపీ గురుకుల పాఠశాల, లాగరాయి జడ్పీ ఉన్నత పాఠశాల, అరకువ్యాలీ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని వెల్లడించారు.

Similar News

News March 6, 2026

కామారెడ్డి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 97.92 శాతం హాజరు

image

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 97.92 శాతం హాజరు నమోదైనట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,585 మంది విద్యార్థులకు గాను 6,448 మంది హాజరయ్యారని, 137 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు ఆయన వివరించారు.

News March 6, 2026

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు

image

పిల్లలను SM తప్పుదారి పట్టిస్తోందని దీనిని బ్యాన్ చేయడం కరెక్టేనని తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా KA ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీరు ఆహ్వానిస్తున్నారు. నేర్చుకునేందుకు SMలో ఎంతో మంచి కంటెంట్ ఉంటే పిల్లలు మాత్రం తప్పుదారి పట్టించే వీడియోలవైపే అట్రాక్ట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమంటున్నారు. మీ కామెంట్?

News March 6, 2026

కాకినాడ GGHలో సెక్యూరిటీ గార్డుల ఘర్షణ

image

కాకినాడ GGHలో సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం శృతిమించింది. శుక్రవారం గార్డులు 2వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీరి ఆగడాలపై ‘Way2News’ ఇప్పటికే కథనం ప్రచురించగా, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.