News April 23, 2025

అల్లూరి: కౌలు రైతు కుమారుడు జిల్లా ఫస్ట్

image

అడ్డతీగల గురుకుల పాఠశాలలో టెన్త్ చదివిన వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి 576 మార్కులు సాధించాడు. దీంతో అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో (గురుకులం) మొదటి స్థానం కైవసం చేసుకున్నాడని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రుక్మాంగద తెలిపారు. రాజవొమ్మంగి మండలం కొత్తపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ పేరెంట్స్ చిన్నబ్బాయి, సుజాత వ్యవసాయ కూలీపని చేసి ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు.

Similar News

News March 13, 2026

రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

image

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.

News March 13, 2026

వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

image

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.

News March 13, 2026

యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

image

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్‌ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.