News March 12, 2025

అల్లూరి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 230 మంది గైర్హాజర్

image

అల్లూరి జిల్లాలో 26పరీక్ష కేంద్రాల్లో సీనియర్ ఇంటర్మీడియేట్ ఫిజిక్స్, ఎకనామిక్స్ జనరల్ పరీక్షలు జరిగాయని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. జనరల్ పరీక్షలకు మొత్తం 5477మంది హాజరు కావలసి ఉండగా 5330మంది హాజరు అయ్యారని, 147మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1211మందికి 1128మంది రాశారని, 83మంది గైర్హాజర్ అయ్యారని తెలిపారు.

Similar News

News February 18, 2026

BREAKING: రూ.5వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,200, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,41,350గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 18, 2026

చిత్తూరు DMHOగా డా.నాగశశి భూషణ్ రెడ్డి

image

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నాగశశి భూషణ్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో DIO అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ శశి భూషణ్ రెడ్డిని DMHOగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో ఈయన బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు.

News February 18, 2026

VZM: సామాన్యులకు SBI రూ.60 లక్షల ప్రమాద భీమా

image

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.