News December 1, 2025
అల్లూరి జిల్లాలో ఈనెల 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పాఠశాల లాగిన్, మనమిత్ర వాట్సాప్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్ జోన్‌లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్‌ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 9, 2026
మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
News February 9, 2026
T20WCలో నేడు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్


