News August 13, 2025

అల్లూరి జిల్లాలో ఈ నెల 19 వరకూ మోస్తరు వర్షాలు

image

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 19వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 10.9 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 25.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 75 నుంచి 86 శాతం ఉంటుందన్నారు.

Similar News

News March 10, 2026

వాడిన నూనె వాడితే క్యాన్సర్ ముప్పు: రామయ్య

image

అమలాపురం హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను తిరిగి వాడటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆహార భద్రతా అధికారి రామయ్య హెచ్చరించారు. సోమవారం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన నూనెను నిల్వ చేయరాదని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 9, 2026

నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

image

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్‌ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్‌ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 9, 2026

గుడివాడలో 11న భారీ జాబ్ మేళా

image

నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ శుభవార్త చెప్పింది. మార్చి 11న కృష్ణాజిల్లా గుడివాడలోని కళాశాలలో ఉదయం 9 గంటలకు భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10 ప్రముఖ కంపెనీల్లో 505 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98488 19682 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.