News April 11, 2025

అల్లూరి జిల్లాలో నిమ్మకాయలకు గిరాకీ

image

ప్రకృతి సిద్ధంగా అనేక పండ్ల తోటలకు నిలయం అయిన అల్లూరి జిల్లాలో నిమ్మకాయలకు భారీ గిరాకీ ఏర్పడింది. గత నెలలో 10నిమ్మకాయలు రూ.10లకు రంపచోడవరం రిటైల్ మార్కెట్‌లో విక్రయించగా శుక్రవారం రూ.50 పలికాయి. అయినా నాణ్యమైన నిమ్మకాయలు రాజమండ్రి, అనకాపల్లి నుంచి ఏజెన్సీ ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు.

Similar News

News January 24, 2026

దుబ్బాకలో తల్లి మృతి తట్టుకోలేక కొడుకు సూసైడ్

image

దుబ్బాక పట్టణంలో ఎండీ అజారుద్దీన్ (28) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం తల్లి మహబూబ్ బీ చెరువులో దూకి మృతి చెందడంతో అప్పటి నుంచి అజారుద్దీన్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన అతడు గురువారం అర్ధరాత్రి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై కీర్తిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News January 24, 2026

నాంపల్లి అగ్నిప్రమాదం: ప్రాణాలకు తెగించి వెళ్లినా.. తిరిగిరాని ముగ్గురు!

image

నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లోపల ఉన్న వారిని కాపాడేందుకు మేనేజర్ మహమ్మద్ హుస్సేన్, ఇంతియాజ్‌తో పాటు మరొక వ్యక్తి సాహసించి లోపలికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వారు తిరిగి రాలేదు. బాధితుల్లో 60 ఏళ్ల వృద్ధురాలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ, మంటల మధ్య వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

News January 24, 2026

​నాంపల్లి అగ్నిప్రమాదం: ప్రాణాలకు తెగించి వెళ్లినా.. తిరిగిరాని ముగ్గురు!