News January 10, 2026
అల్లూరి జిల్లాలో పడిపోతున్న ఉష్టోగ్రతలు

అల్లూరి, పోలవరం జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. వై.రామవరం, కొయ్యురు, మారేడుమిల్లి, అరకు, ముంచింగిపుట్టు తదితర మండలాల్లో శుక్రవారం రాత్రి 9డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. చలిగాలులు తీవ్రత కూడా పెరగడంతో ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. అక్కడక్కడా రోడ్డు ప్రక్కన చలి మంటలు వేసుకుంటున్నారు.
Similar News
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.
News January 13, 2026
నగరిలో డైయింగ్ ఫ్యాక్టరీల దందా…!

నగరిలో 18 డైయింగ్ యూనిట్లు ఉన్నాయి. అనేక కారణాలతో 4యూనిట్లు మూతపడ్డాయి. నూలుకు రంగులు వేసి, ఆ నీటిని మళ్లీ రీసైకిల్ చేసి వాడాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్‌తో రంగులు అద్దిన నీటిని కుశస్థలి నదిలోకి వదిలేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ కలుషితం అవుతోంది. కొన్ని యూనిట్లలో పగలు రీసైకిల్ చేస్తుండగా రాత్రి వేళ నేరుగా వదిలేస్తున్నారు. దీనిపై నగరి ఎమ్మెల్యే ఫోకస్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News January 13, 2026
నెల్లూరు: రూ.200 కోట్ల రుణ ‘సహకారం’

సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా 2025-26 మార్చి కల్లా రూ.2,250 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, రూ.2,050 కోట్ల రుణాలను 37,039 మంది రైతులకు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద వరికి రూ.52 వేలు, మిర్చి రూ.1.50 లక్షలు, పసుపు రూ.1.15-1.25 లక్షలు, నిమ్మ రూ.75- 85 వేలు, అరటి రూ.1.10 లక్షలు, చేపలు, రొయ్యలు రూ.3.75 – 4.07 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మరో 2 నెలలు గడువుకి రూ.200 కోట్ల రుణాలకు అవకాశం ఉంది.


