News November 7, 2025

అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

అల్లూరి జిల్లాలో శనివారం అన్ని పాఠశాలలు నడుస్తాయని DEO. బ్రహ్మాజీరావు శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. మొంథా తుఫాన్‌తో ఇచ్చిన సెలవుల భర్తీలో భాగంగా రెండవ శనివారం సెలవును ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలతో బాటు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. టీచర్స్ సంఘాల ప్రతినిధులు రేపు సెలవు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారని చెప్పారు.

Similar News

News January 15, 2026

U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

image

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.

News January 15, 2026

RITESలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

image

RITESలో 7 అసిస్టెంట్ మేనేజర్(HR)పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 27 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News January 15, 2026

తిరుపతి: భయపెడుతున్న టిప్పర్లు

image

తిరుపతి జిల్లా నుంచి తమిళనాడుకు భారీగా గ్రావెల్, ఇసుక, కంకర తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం మీదుగా రోజుకు 250 నుంచి 300 వరకు టిప్పర్లు బార్డర్ దాటుతున్నాయి. కొన్ని అనుమతులు లేకుండా, మరికొన్ని నకిలీ బిల్లులతో తరలిస్తున్నారని సమాచారం. పుత్తూరు-చెన్నై మెయిన్ రోడ్డుపై రాత్రి వేళ టిప్పర్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణాలంటేనే అందరూ హడలిపోతున్నారు.