News December 1, 2025
అల్లూరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బంద్.. కానరాని ప్రభావం

మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఆదివారం మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొయ్యూరు, జీకేవీధి, సీలేరు తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రపాలెం వారపు సంత యథావిధిగా జరిగింది. పలుచోట్ల దుకాణాలు పనిచేశాయి.ప్రైవేటు వాహనాలు తిరిగాయి. బంద్ ప్రభావం కానరాలేదు.
Similar News
News February 7, 2026
ఎన్నికల కౌంటింగ్ పాసుల కోసం దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అక్రెడిటేషన్ కలిగిన విలేకరులు పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈనెల 9న నస్పూర్ కలెక్టరేట్‌లోని G4 గదిలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ అక్రెడిటేషన్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఎన్నికల కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
News February 7, 2026
MNCL: కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే వరకు

కౌన్సిలర్‌గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి, 4 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత నడిపల్లి దివాకర్ రావుది. 1981లో కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన, ఆ తర్వాత 1999, 2004, 2014, 2018 ఎన్నికల్లో లక్షెట్టిపేట, MNCL నుంచి MLAగా విజయం సాధించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సాకారం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరఫున సేవలందించిన ఆయన రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
News February 7, 2026
బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.


