News May 7, 2025
అల్లూరి జిల్లాలో 24 మంది హెచ్‌ఎంలకు మెమోలు

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 81 శాతం కంటే తక్కువ విద్యార్థులు పాస్ అయిన పాఠశాల హెచ్‌ఎంలకు మెమోలు జారీ చేశామని DEO బ్రాహ్మజీరావు శనివారం తెలిపారు. అల్లూరి జిల్లాలో మొత్తం 44 పాఠశాలలు ఉండగా 24 పాఠశాలల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ఈనెల 28 నుంచి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు అంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
Similar News
News February 18, 2026
ఎటపాక: రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫ్రెండ్‌పై హత్యాయత్నం

స్నేహితుడికి రూ.కోటి విలువైన ఇన్సూరెన్స్ చేపించి.. తిరిగి అతడ్ని చంపి డబ్బు కాజేయాలని చూశాడో ప్రబుద్దుడు. వివరాలు ఇలా.. ఎటపాక(M) గన్నవరానికి చెందిన యశ్వంత్ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్నేహితుడు దీపక్ యశ్వంత్‌తో రూ.కోటి విలువైన బీమా కట్టించాడు. సోదరుడిని అంటూ నామినీగా తన పేరు పెట్టాడు. యశ్వంత్‌పై మరో వ్యక్తితో కలిసి దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. పోలీసు విచారణలో బాగోతం బయటపడింది.
News February 18, 2026
హాట్ టాపిక్‌గా మారిన MLA గళ్లా మాధవి ర్యాంక్

TDPలో గుంటూరు వెస్ట్ MLA గళ్లా మాధవి ర్యాంక్ హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి క్షమాపణలు చెప్పాలంటూ చేపట్టిన ఆందోళన ఘటనలో మాధవి హైలెట్‌గా నిలిచారు. అయితే MLAల పనితీరుపై తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌లో మాధవికి B గ్రేడ్ రావడంతో క్యాడర్ నిరుత్సాహపడినట్లు చర్చ సాగుతోంది. దీంతో మాధవి ఫైర్ బ్రాండ్ అంటూ మురిసిపోయిన TDP నేతలు ఇప్పుడేమంటారని YCP నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
News February 18, 2026
చింతూరు: నేడు గ్రీవెన్స్ రద్దు

పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం జరగవలసిన గ్రీవెన్స్ను రద్దు చేశామని ITDA PO శుభం నొక్వాల్ మీడియాకు తెలిపారు. పరిపాలనపరమైన ముఖ్య కార్యక్రమాల వలన రద్దు చేశామని తెలిపారు. చింతూరు డివిజన్ 4మండలాలకు చెందిన వారు గమనించాలని కోరారు. అర్జీలు సమర్పించేందుకు చింతూరు రావద్దని సూచించారు.


