News November 8, 2025

అల్లూరి: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) పరిధిలో జిల్లాలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ శుక్రవారం తెలిపారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్సైట్ allurisitharamaraju.ap.gov.inను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Similar News

News January 20, 2026

ఒంగోలు SP కీలక ఆదేశాలు

image

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.

News January 20, 2026

నెల్లూరు కలెక్టర్‌కు అవార్డు

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తన ప్రతిభ చూపారు. ఆయన అందించిన సేవలకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. అత్యధికంగా ఓటర్ల మ్యాపింగ్ చేయడంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈనెల 25వ తేదీ జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు.

News January 20, 2026

నంద్యాల కలెక్టర్‌కు అవార్డు

image

నంద్యాల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రాజకుమారి ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డుకు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ ఎన్నికల పద్ధతులను అమలు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. జనవరి 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.