News October 7, 2025
అల్లూరి: బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో క్రింది స్థాయి సిబ్బంది ప్రతి గృహాన్ని సందర్శించి మరుగుదొడ్లు సౌకర్యం ఉందో, లేదో సమాచారం సేకరించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News January 15, 2026
NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.
News January 15, 2026
చిత్తూరు ఎస్పీకి నోటీసులు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.
News January 15, 2026
KMM: సాంబారులో పడిన చిన్నారి మృతి

వైరా మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మునగాల సింహాద్రి, సరోజనిల కుమార్తె రమ్యశ్రీ(3) గత నెల 18న ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన రమ్యశ్రీ.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచింది. సంక్రాంతి వేల చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.


