News March 14, 2025

అల్లూరి: మహిళా టీచర్లు మాత్రమే అర్హులు

image

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు సమన్వయకర్త స్వామి నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ టీచర్లు అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 19 వరకు దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 19, 2025

సంగారెడ్డి: 24 లోపు పూర్తిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉపాధి హామీ, పంచాయతీల శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు ఈనెల 24 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ జ్యోతి, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

News March 19, 2025

వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

image

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.

News March 19, 2025

వనపర్తి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక 

image

సీతారాముల కళ్యాణం తిలకించడానికి భద్రాచలం వెళ్లని వారికి ఆర్టీసీ వారు కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ తెలిపారు. రూ.151 చెల్లించి రసీదు పొందితే భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే చేర్చుతారన్నారు. వివరాల కోసం వనపర్తి-9866344200, పెబ్బేరు-8801828143, కొత్తకోట-8886848518, ఆత్మకూర్-7382829494లో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!