News August 13, 2025
అల్లూరి: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ దినేశ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖల పురోగతిపై వీసీ ద్వారా సమీక్షించారు. సమస్యాత్మక అంగన్వాడీలపై దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీల్లో డేటా ఎంట్రీలో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా ఎంట్రీ వేగవంతం చేయాలన్నారు. ఎంపీడీవోలు, CDPOలు, సూపర్‌వైజర్లు, సచివాలయాలు, అంగన్వాడీలు సమన్వయంతో పని చేయాలన్నారు.
Similar News
News March 15, 2026
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 1,800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్ పాయింట్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క పోలీసు భక్తుల సేవలో నిమగ్నమై పనిచేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
News March 15, 2026
గుడిపల్లి రిజర్వాయర్ సందర్శించిన మాజీ మంత్రి నాగం

NGKL జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా.నాగం జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించి, సాగునీటి విడుదలపై ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
News March 15, 2026
నల్గొండ: ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఉమ్మడి NLG జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా MLA వేముల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి కర్తయ్య, కోశాధికారిగా ఇమామ్ కరీం ఎన్నికయ్యారు. 2030 వరకు నాలుగేళ్ల పాటు ఈ కమిటీ బాధ్యతల్లో కొనసాగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని MLA తెలిపారు.


