News September 11, 2025

అల్లూరి: హోం స్టేలు ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలి

image

ప్రస్తుత పర్యాటక సీజన్‌లో గిరిజన హోం స్టేలు ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో మేడ్ ఇన్ అరకు ఉత్పత్తులు విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. పర్యాటకులు గిరిజన గ్రామాల్లో రాత్రి మకాం చేయడానికి అనువుగా ఉండే విధంగా హోం స్టేలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Similar News

News December 14, 2025

మంచిర్యాల జిల్లాలో 56.44% పోలింగ్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది. .

News December 14, 2025

వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @11AM

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.7% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 56.4%, కొత్తకోట 60.4%, మదనాపూర్ 60.9%, ఆత్మకూరు 57.8%, అమరచింత 67.0% పోలింగ్ నమోదైంది.

News December 14, 2025

అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ మేళా

image

అనకాపల్లి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన అనకాపల్లి ఆదినారాయణ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, పీజీ చేసి 18-40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 52 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు.