News March 4, 2025

అల్లూరి: ‘48 గంటల్లో నగదు చెల్లించాలి’

image

దీపం-2 పథకం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. దీపం పథకంలో గ్యాస్ సరఫరాదారులు అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ తీసుకున్న 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో నగదు చెల్లించాలన్నారు. ఉచిత గ్యాస్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

Similar News

News March 19, 2025

ఈనెల 26 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

image

రాజంపేట మండలం తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ అధికారిని హేమలత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, సప్తగిరిల సంకీర్తన, గోష్టి గానం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, శ్రీరామ పాదుకలు నాటకం ఉంటుందని తెలిపారు.

News March 19, 2025

విశాఖలో కానరాని చలివేంద్రాలు..! 

image

విశాఖనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే ఎక్కడ వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. మనిషి నిరసించి పడిపోతే వెంటనే నీరు అవసరం. గతంలో జీవీఎంసీ సహా పలు స్వచ్ఛందసంస్థలు ప్రతివార్డులో చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసేవి. ఇప్పుడు ఆరిలోవ నుంచి మద్దిలపాలెం వరకు ఎక్కడ చుసిన ఒక్క చలివేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.

News March 19, 2025

కొల్లిపర: పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్  

image

కొల్లిపరలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొల్లిపర పాఠశాలను సెన్సిటివ్ జాబితాలో ఎందుకు చేర్చారని అధికారులను ప్రశ్నించారు. 

error: Content is protected !!