News August 12, 2025

అవయవ దానంతో మరొకరికి జీవితం: మంత్రి సత్యకుమార్

image

“వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అవయవదానంతో మరొకరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని మంత్రి అన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌ఎల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు గన్ని భాస్కరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 10, 2026

రాజమండ్రిలో HPV వ్యాక్సినేషన్ పోస్టర్ ఆవిష్కరణ

image

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News March 9, 2026

12న రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్

image

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారి టి.శ్రీదేవి సోమవారం తెలిపారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గృహహింస, ఇతర అన్యాయాలకు గురయ్యే మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.