News August 4, 2024

అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం: కర్నూల్ కలెక్టర్

image

విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు అందించిన నిస్వార్థ సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు భారత ప్రభుత్వం సుభాశ్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-25కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ అవార్డును ప్రతి ఏడాది జనవరి 23న చంద్రబోస్ జయంతి రోజున ప్రకటిస్తారన్నారు. అవార్డు పారితోషికం సంస్థకు రూ.51 లక్షలు, వ్యక్తులకు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు.

Similar News

News September 15, 2024

గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు తీసుకోండి- ఎస్పీ

image

వినాయక ఉత్సవాల్లో ఆఖరు ఘట్టమైన గణేష్ నిమజ్జనం జిల్లా కేంద్రంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గణేష్ నిమజ్జనం ఘాట్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక ప్రతిమల ఊరేగింపు మొదలు నిమజ్జనం పూర్తి అయ్యేవరకు, ఉత్సవ కమిటీలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 15, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

image

కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఈనెల 16న(సోమవారం) నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కర్నూలుకు రావద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు.

News September 14, 2024

ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ

image

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.