News September 13, 2025

అశ్వారావుపేట: వాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

image

అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల వాగులో ఈరోజు కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. పత్తి చేనులో పనికి వెళ్లిన చెన్నమ్మ(50), వరలక్ష్మి (55) వాగు దాటే క్రమంలో గల్లంతయ్యారు.వారు ఏపీకి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గల్లంతయ్యారని తెలిపారు. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వారిలో నలుగురు ఒడ్డుకు చేరుకోగా ఇద్దరు గల్లంతయ్యారు.

Similar News

News December 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 94

image

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 12, 2025

బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

image

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.

News December 12, 2025

362 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTS పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.650, SC, ST, PwBDలకు రూ.550. వెబ్‌సైట్: https://www.mha.gov.in/లేదా https://www.ncs.gov.in/