News November 5, 2025

అసభ్య ప్రవర్తన.. టీచర్ సుధాకర్ సస్పెన్షన్

image

తన వికృత చేష్టలతో విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడు సుధాకర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు సుధాకర్‌ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై చేపట్టిన విచారణలో రుజువు కావడంతో సస్పెండ్‌ చేసినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు.

Similar News

News January 19, 2026

SRCL: ‘మహిళల ఆర్థిక ప్రగతితో దేశ రాష్ట్ర ప్రగతి సాధ్యం’

image

మహిళల ఆర్థిక ప్రగతితో దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వామ్యులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని, స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

News January 19, 2026

రేపు ఆటోల బంద్.. క్లారిటీ

image

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్‌ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

News January 19, 2026

సిరిసిల్ల: ‘మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలి’

image

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,295 మహిళా సంఘాలకు (SHG) ₹4,64,68,771 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి సమాజంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని అన్నారు.