News August 20, 2025
అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు.. దరఖాస్తులకు నేడే ఆఖరు

అనంతపురం JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు (Adhoc-Contract-Base) భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లిష్ (1), ఫిజిక్స్ (1) ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు principal.cea@jntua.ac.inకు తమ బయోడేటాను పంపాలని ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు పీజీ అర్హత ఉంటే చాలు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
Similar News
News January 15, 2026
KKRపై చర్యలకు సిఫారసు.. తిరస్కరించిన ముస్తాఫిజుర్

IPL నుంచి BAN ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను KKR తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొటెస్ట్ చేసి కాంపెన్సేషన్ డిమాండ్ చేయాలని అడిగితే ముస్తాఫిజుర్ తిరస్కరించాడని BAN క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Md మిథున్ వెల్లడించారు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో కాంట్రాక్ట్ రద్దు చేస్తే చర్యలు తీసుకోవచ్చని వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ చెప్పిందని, కానీ ముస్తాఫిజుర్ వద్దనడంతో వెనక్కి తగ్గామన్నారు.
News January 15, 2026
మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.
News January 15, 2026
బాపట్ల: త్రిపురనేని రామస్వామికి చౌదరికి నివాళి

నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, సమానత్వం వైపు అడుగులు వేయడానికి త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తి అని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు.


