News November 8, 2025

అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

image

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్‌ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్‌ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.

Similar News

News January 15, 2026

కొత్తపల్లిలో సందడి చేసిన పెద్ది మూవీ డైరెక్టర్

image

యూ. కొత్తపల్లిలో బుధవారం ప్రముఖ సినీ దర్శకుడు బుచ్చిబాబు సందడి చేశారు. ఆయన స్వగ్రామం కొత్తపల్లి కావడంతో సంక్రాంతి వేడుకల కోసం ఇక్కడికి విచ్చేశారు. ‘ఉప్పెన’ చిత్రంతో హిట్ కొట్టిన బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్‌తో పెద్ది సినిమా తీస్తున్నారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్నేహితులు కలిసేందుకు పోటీపడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు క్యూ కట్టారు.

News January 15, 2026

అమెరికా సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌కు షాక్

image

అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 21 నుంచి 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్, బ్రెజిల్, రష్యా, ఇరాన్, సోమాలియా, అఫ్గానిస్థాన్‌ సహా అనేక దేశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా USతో సన్నిహితంగా ఉంటున్న పాక్‌కు ఈ నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు.

News January 15, 2026

TODAY HEADLINES

image

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్‌ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన