News September 25, 2024
అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక: మంత్రి కొండా
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ తొలి పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ ధీరచరిత్ర ఎన్నో ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఆమె చేసిన భూ-పోరాటమే తర్వాత కాలంలో భూ సంస్కరణలకు దారి చూపిందని స్పష్టం చేశారు.
Similar News
News October 15, 2024
వరంగల్ జిల్లాకు వర్ష సూచన
రాష్ట్రంలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 18 వరకు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణశాఖ జారీ చేసింది.
News October 15, 2024
ట్రాన్స్‌ఫార్మర్లపై టోల్ ఫ్రీ నెంబర్లు ముద్రించాలి: CMD
TGNPDCL, హనుమకొండ, విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్ని సర్కిళ్ల SE, డివిజినల్ ఇంజినీర్ల(టెక్నికల్)తో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. CMD మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌పై టోల్ ఫ్రీ నంబర్లు 18004250028, 1912 ముద్రించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఈ నంబర్లను వినియోగదారులకు చేరేలా చూడాలన్నారు.
News October 15, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> WGL: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
> MHBD: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
> WGL: గడ్డి మందు తాగి యువకుడు మృతి!
> HNK: బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
> MHBD: పిడుగుపాటుకు గురై మూడు ఆవులు మృతి
> TRR: బైకును ఢీ-కొట్టిన బోర్ వెల్ లారీ.. వ్యక్తి మృతి