News November 19, 2025

ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

image

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్‌దే అగ్రభాగం.

Similar News

News January 15, 2026

బాలింతలు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా?

image

పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా లేదా అనేది వారి ఆరోగ్యస్థితిపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే పిల్లల వయసు, ఆరోగ్యం, తల్లికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తారు. పాలద్వారా యాంటీబయాటిక్స్ తక్కువ మొత్తంలోనే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయినా ఇలాంటి మందులేవైనా వాడేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

image

నిరసనల కారణంగా ఇరాన్‌ <<18861323>>గగనతలాన్ని<<>> మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియా, ఇండిగో సహా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలను దారిమళ్లిస్తున్నట్లు, మరికొన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మార్పులు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరాయి. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.

News January 15, 2026

కనుమ నాడు గోవులకు పూజ ఎందుకు చేస్తారు?

image

కనుమ అంటేనే పశువుల పండుగ. అవి ఏడాదంతా పొలం పనుల్లో రైతుకు చేదోడువాదోడుగా ఉంటాయి. పంట చేతికి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కృతజ్ఞతగా నేడు వాటిని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను రక్షించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గోపూజ సంప్రదాయం మొదలైంది. ఆవును జంతువుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, జీవనాధారానికి ప్రతీకగా భావిస్తారు. ఆవును గౌరవించడం మన సంస్కృతిలో భాగం.