News March 7, 2025

ఆక్రమణలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

image

ఆక్రమణలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 2019 అక్టోబర్ 15లోగా గృహాలు నిర్మించిన వారు చట్టబద్ధమైన హక్కులు కల్పించుటకు గాను, ప్రభుత్వం (జీవో ఎం ఎస్ నెంబర్30/2025) విడుదల చేసిందని పేర్కొన్నారు. గ్రామ వార్డులు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 17, 2025

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా రమేష్ ?

image

శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇతను మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానం నుంచి ఉత్తర్వులు రానున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ని 26 జిల్లాలకు కొత్త టీడీపీ అధ్యక్షుల పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి.

News December 17, 2025

ఎచ్చెర్ల: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన’

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని AP మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పిల్లల రక్షణకు కూడా పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.

News December 17, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

image

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>