News December 1, 2025

ఆఖరి రాగం పాడేద్దామా..!

image

చూస్తుండగానే 2025లో డిసెంబర్ వచ్చేసింది. 30 రోజులు ఆగితే చివరి పేజీ కూడా చిరిగిపోతుంది. 2025ను సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు, గుణపాఠాలు. కొన్ని స్వీట్‌గా, కొన్ని ఘాటుగా, ఇంకొన్ని కాస్త కాస్ట్లీ. మిక్చర్ ప్యాకెట్ లాంటి మిక్స్డ్ ఫీల్ ఇయర్‌లో మీ బెస్ట్ ప్లేస్, మెమొరి, బ్యాడ్ డే.. ఇలా డైలీ ఓ విషయం షేర్ చేసుకుందాం. ఈ ఇయర్‌కు ఇలా ఆఖరి రాగం పాడేద్దాం!
రోజూ 7pmకు స్పెషల్‌గా కలుద్దాం.

Similar News

News February 16, 2026

జామలో గజ్జి తెగులును ఎలా నివారించాలి?

image

జామ పంటలో గజ్జి తెగులు ప్రధానంగా పచ్చి కాయలపై కనిపిస్తుంది. దీని వల్ల కాయలపై చిన్నచిన్న తుప్పు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగా పెరగకుండా రాలిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగులును నివారించడానికి లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్‌ 4 గ్రాముల కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 16, 2026

మహిళలు హనుమంతుడి పాదాలు తాకకూడదా?

image

‘హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచర్య నియమాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతో మహిళలు స్వామివారి పాదాలను తాకకూడదు’ అని పండితులు సూచిస్తున్నారు. భక్తికి లింగభేదం లేదని చెబుతున్నారు. ‘మహిళలు హనుమాన్ చాలీసా పఠించవచ్చు. కఠిన ఉపవాసాలు ఉండవచ్చు. సీతాదేవిని తల్లిగా గౌరవించిన హనుమంతుని పట్ల మహిళలు చూపించే నిష్కల్మషమైన భక్తి, మానసిక ఆరాధన అత్యంత పుణ్యప్రద ఫలితాలను ఇస్తాయి’ అని చెబుతున్నారు.

News February 16, 2026

భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

image

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.