News November 20, 2025
ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

ఆన్‌లైన్‌లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News January 24, 2026
ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<
News January 24, 2026
భార్య సూచననే పాటించా: సూర్య కుమార్

468 రోజుల తర్వాత <<18940538>>అర్ధసెంచరీ<<>> చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి భార్య దేవిషా ఇచ్చిన సలహానే కారణమని చెప్పారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోమని ఆమె సూచించినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఇదే పాటించానని SKY పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో 37 బంతుల్లో 82 రన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
News January 24, 2026
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in


