News August 11, 2025
ఆగస్టు 15 వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రగతి మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను, పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. వసతులు సక్రమంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 6, 2026
BREAKING ఖమ్మం: భార్యకు నిప్పంటించి భర్త ఆత్మహత్య

తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తోటమల్ల నాగభూషణం తన భార్య జయమ్మ నిద్రిస్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన జయమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
News March 6, 2026
కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
News March 6, 2026
వేములవాడ: వైభవంగా రాజన్న దివ్య కళ్యాణం

వేములవాడ పుణ్యక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివార్చన వేదికపై ఆలయ స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులు దర్శించుకొని పులకించిపోయారు.


