News August 8, 2024
ఆగస్టు 8: చరిత్రలో ఈ రోజు
1870: అవధాన విద్యకు ఆద్యుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జననం
1907: ప్రముఖ శతావధాని అనుముల వెంకటశేషకవి జననం
1981: ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ జననం
1987: స్వాతంత్ర్య సమరయోధులు, కవి గురజాడ రాఘవశర్మ మరణం
1994: ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి చాను జననం
Similar News
News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి
TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
News September 16, 2024
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తోనే!
‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు తెలిపాయి. అయితే, త్రివిక్రమ్ కాకుండా మరో డైరెక్టర్‌తో సినిమా రాబోతోందనేది పూర్తిగా అవాస్తవమని, వాటిని నమ్మొద్దని చెప్పాయి. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
News September 16, 2024
వర్సిటీలను ప్రక్షాళన చేయనున్నాం: లోకేశ్
AP: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్ని సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న ఆచార్యులు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.