News April 11, 2025
ఆగిరిపల్లిలో సీఎం పర్యటన వివరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆగిరిపల్లి పర్యటన వివరాలను సమాచార శాఖ గురువారం రాత్రి వెల్లడించింది. రేపు ఉదయం 10:20 నిమిషాలకు ఆగిరిపల్లి మండలం వడ్లమాను హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం 10:30 నుంచి బీసీ కమ్యూనిటీ వర్క్ షాపుల వద్ద కార్మికులతో మధ్యాహ్నం 12 గం: వరకు సీఎం ఇంట్రాక్షన్, మధ్యాహ్నం12:30 కి సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం క్యాడర్‌తో సమావేశంలో పాల్గొంటారు.
Similar News
News January 21, 2026
ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌పై రివ్యూ చేసేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.
News January 21, 2026
HYDలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్‌మెంట్ పర్మిషన్ కావాలన్నా ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. టౌన్ ప్లానింగ్ విభాగం March 2026 నుంచి ‘BuildNow’ అనే ఫుల్ ప్లెడ్జ్ అప్లికేషన్‌ను తెస్తోంది. ఇది మామూలు యాప్ కాదు. AIతో పనిచేసే అత్యాధునిక టెక్నాలజీ. డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో పెడితే చాలు AI టూల్స్ అన్నీ చెక్ చేసి ఇట్టే అప్రూవల్ ఇచ్చేస్తాయి. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం BuildNowకు శ్రీకారం చుట్టింది.
News January 21, 2026
ఆదిలాబాద్: రేపు ఇంటర్ ప్రాక్టికల్స్ యథాతథం

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిరోజు ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ తెలిపారు. గురువారం కూడా ప్రాక్టికల్స్ యథావిధిగా కొనసాగుతాయని నాగోబా సెలవు ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ప్రాక్టికల్‌కు హాజరు కావాలని సూచించారు. కాగా బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల)లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను DIEO సందర్శించి పరిశీలించారు.


