News April 30, 2024

ఆటోను ఢీకొన్న లారీ, ఆటో డ్రైవర్ మృతి

image

ఆటోను లారీ ఢీకొట్టగా ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గోసు గోపయ్య(42) ఆటో డ్రైవర్ గా
పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఖమ్మం నుంచి వెంకటగిరి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 17, 2025

ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.

News December 17, 2025

ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

image

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News December 17, 2025

ఖమ్మం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయింపు

image

ఖమ్మం జిల్లా రేషన్ లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి శుభవార్త తెలిపారు. రేపటి నుంచి 22 వరకు జిల్లాలోని చౌక ధరల దుకాణాల్లో బియ్యం లభిస్తాయని ప్రకటించారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించి, షాపులకు సరఫరా చేశామని తెలిపారు. లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల రేషన్ షాపుల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని కోరారు.