News September 10, 2025
ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడు సీఎం రేవంత్: హరీశ్ రావు

మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం ఆడబిడ్డల ఆత్మగౌరవమైన నిలబెట్టు రేవంత్ రెడ్డి అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు x వేదికగా అన్నారు. గజ్వేల్‌లో యూరియా కోసం వచ్చిన మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకునే దుస్థితి తెచ్చినట్లు మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు కొట్టుకునే వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం లో రైతులకు కన్నీరు తప్పడం లేదన్నారు.
Similar News
News December 14, 2025
పాక్‌తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

మెన్స్ U19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయిలో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. కాసేపట్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆరంభించనుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.
News December 14, 2025
హన్మకొండ: 19.57% శాతం పోలింగ్ @9AM

జిల్లాలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. 9 గంటల సమయానికి జిల్లా మొత్తం మీద 19.57% పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వేలేరులో అత్యధికంగా 22.55% పోలింగ్ నమోదు కాగా, ధర్మసాగర్‌లో 21.18% ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఐనవోలులో 18.52%, హసన్‌పర్తిలో 17.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


