News March 21, 2024
ఆత్మకూరు: మహిళపై అత్యాచారయత్నం

ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన దేవర్ల మహేశ్‌కు ఆత్మకూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి 4 నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారని ఎస్ఐ సురేశ్ తెలిపారు. 2018లో అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు రాగా ఏఎస్ఐ జమీరుద్దీన్ కేసు నమోదు చేశారన్నారు. పూర్తి స్థాయిలో ఆధారాలు కోర్టులో సమర్పించడంతో బాధితురాలికి న్యాయం జరిగిందన్నారు.
Similar News
News December 12, 2025
MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
News December 12, 2025
MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
News December 12, 2025
MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


