News September 12, 2025
ఆత్మకూరు- వనపర్తి రాకపోకలు బంద్

ఆత్మకూరు-వనపర్తి మధ్య రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. మదనాపురం దగ్గర ఉన్న ఊకచెట్టు వాగు కాజువేపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి వనపర్తి, కొత్తకోటకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పారు.
Similar News
News December 10, 2025
ప్రాణాలు తీసిన గ్యాస్ గీజర్లు

గ్యాస్ గీజర్లు కారణంగా 2 వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరులో 26 ఏళ్ల చాందినీతో పాటు నాలుగేళ్ల కుమార్తె గీజర్ గ్యాస్ లీక్ అయి ప్రాణాలు కోల్పోయారు. UPలోని బఘ్‌పట్‌లో అభిషేక్ అనే యువకుడు బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల మృతిచెందాడు. తలుపును పగులగొట్టి బయటకు తీసేలోపే చనిపోయాడు. క్లోజ్డ్ బాత్‌రూమ్‌లో గ్యాస్ <<18108885>>గీజర్<<>> వినియోగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News December 10, 2025
ఈనెల 31 వరకే వీటికి గడువు

2025 ఎండింగ్‌కి వస్తుండటంతో పలు ఆర్థిక సంబంధిత గడువులు దగ్గరపడుతున్నాయి. ఈనెల 31లోపు పూర్తి చేయకపోతే జరిమానాలు, సేవల నిలిపివేత వంటి ఇబ్బందులుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
1. ముందస్తు పన్ను 3వ విడత చివరి తేదీ ఈనెల 15
2. బిలేటెడ్ ITR దాఖలకు 31 చివరి తేదీ
3. పాన్-ఆధార్ లింక్ డిసెంబర్ 31లోపు తప్పనిసరి
4. PM ఆవాస్ యోజన దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31
5. రేషన్ కార్డు e-KYC
News December 10, 2025
WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్‌గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.


