News April 20, 2024

ఆత్మకూరు : 22న ఆనం నామినేషన్

image

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి ఏప్రిల్ 22వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూరు సత్రం సెంటరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, మీదుగా మున్సిపల్ ఆఫీసుకు చేరుకుంటారని ఆనం కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

Similar News

News December 17, 2025

గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

image

నెల్లూరు కార్పొరేషన్‌కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్‌లో సమావేశం ఉంటుంది. ఇన్‌ఛార్జ్ మేయర్‌ రూప్‌ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.

News December 17, 2025

లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

లింగసముద్రం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్‌పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News December 17, 2025

బుచ్చిలో మహిళ ఆత్మహత్యాయత్నం

image

చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుచ్చిలోని చెన్నూర్ రోడ్డులో మంగళవారం జరిగింది. మహందాపురానికి చెందిన శ్రీను నెల్లూరుకు చెందిన భార్గవిని 2ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. ప్రస్తుతం ఆ మహిళ రెండు నెలల గర్భవతి. భర్తని హోటల్లో భోజనం తెమ్మని, భర్త వచ్చేలోపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త గమనించి రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించాడు.