News November 19, 2025

ఆత్మాహుతి దాడి.. పశ్చాత్తాపం లేని రషీద్

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీకి సాయం చేసిన అమీర్ రషీద్ అలీలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతని లాయర్ స్మృతి చతుర్వేది వెల్లడించారు. దాడిలో పాల్గొన్న i20 కారును తానే రిజిస్టర్ చేయించినట్లు ఒప్పుకున్నారన్నారు. కశ్మీర్‌కు చెందిన రషీద్‌ను ఈ నెల 16న NIA <<18306148>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే. సూసైడ్ బాంబింగ్‌లో అతనిదే కీలక పాత్ర అని అధికారులు చెబుతున్నారు.

Similar News

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నాయా?

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 18, 2026

GHMC: 300 డివిజన్ల ‘మెగా’ రిజర్వేషన్లు.. పక్కా గణాంకాలు

image

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News January 18, 2026

శుభ సమయం (18-1-2026) ఆదివారం

image

➤ తిథి: అమావాస్య రా.1.13 వరకు ➤ నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.33 వరకు ➤ శుభ సమయాలు: ఉ.07.30-10.17, ఉ.11.12-12.8, తిరిగి మ.1.58-4.10 వరకు ➤ రాహుకాలం: సా.4.30-06.00 వరకు ➤ యమగండం: మ.12.00-1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.11-4.56 వరకు ➤ వర్జ్యం: రా.7.06-8.48