News November 19, 2025
ఆత్మాహుతి దాడి.. పశ్చాత్తాపం లేని రషీద్

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీకి సాయం చేసిన అమీర్ రషీద్ అలీలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతని లాయర్ స్మృతి చతుర్వేది వెల్లడించారు. దాడిలో పాల్గొన్న i20 కారును తానే రిజిస్టర్ చేయించినట్లు ఒప్పుకున్నారన్నారు. కశ్మీర్‌కు చెందిన రషీద్‌ను ఈ నెల 16న NIA <<18306148>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే. సూసైడ్ బాంబింగ్‌లో అతనిదే కీలక పాత్ర అని అధికారులు చెబుతున్నారు.
Similar News
News January 17, 2026
పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
News January 17, 2026
U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT
News January 17, 2026
పిల్లల్లో ఆటిజం ఉందా?

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.


