News August 14, 2025

ఆదికర్మయోగి-గిరిజనప్రాంత మార్పుకు గొప్ప శ్రీకారం: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆది కర్మయోగి కార్యక్రమం గిరిజన ప్రాంతంలో మార్పు తెచ్చుటకు గొప్ప శ్రీకారమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఐటిడిఏ కార్యాలయంలో బుధవారం బ్లాక్ స్ధాయి శిక్షణ, సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గిరిజనగ్రామాల్లో స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పీఎం జన్ మాన్ పీవో రిషబ్ చతుర్వేది, అసుతోష్ శ్రీవాస్తవ సభను ఉద్దేశించి మాట్లాడారు.

Similar News

News March 15, 2026

22న రైతు భరోసా నిధులు

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడ‌త‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.

News March 15, 2026

LSGకి బిగ్ షాక్?

image

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.

News March 15, 2026

ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

image

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.