News April 12, 2024
ఆదిలాబాద్‌కు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శుక్రవారం HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్, మంచిర్యాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు సాయంత్రం పూట బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Similar News
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మహిళదే విజయం

ఇచ్చోడ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లత విజయం సాధించారు. ప్రత్యర్థి రాథోడ్ మనోజ్‌పై 50 ఓట్ల తేడాతో రాథోడ్ లత గెలుపొందారు. ఈ గ్రామపంచాయతీలో 8 వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. .
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.10 శాతం ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.18%, గాదిగూడలో 78.18% నమోదైంది.
*GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 11, 2025
నార్నూర్: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థి భర్త

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్‌లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఇన్‌ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.


