News September 13, 2025

ఆదిలాబాద్‌కు కాస్త ఊరట.. మళ్లీ భారీ వర్షాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో జల్లులు మాత్రమే కురిశాయి. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

ADB: 166 సర్పంచ్, 1392 వార్డ్ స్థానాలకు ఎన్నికలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సరిపడినంత సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు.

News December 9, 2025

ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు.​ ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.

News December 9, 2025

ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

image

ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.